పంగులూరు మండలం ముప్పవరం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనకనుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న కొండమూరు గ్రామానికి చెందిన దరియా వలి కు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ వాహనంలో అద్దంకి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై తిరుపతిరావు పరిశీలించారు.
![]() |
![]() |