కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన జెన్నీఫర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాలేయం మార్పిడికి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న కొమరోలు మండల టిడిపి అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు బాలిక కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. ఆర్థిక సహాయం అందించిన వెంకటేశ్వర్లకు బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |