గత ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన 117 జీవోను తక్ష ణం రద్దు చేయాలని అన్నమయ్య జిల్లా ఏపీ టీచర్స్ ఫెడరేషన (ఏపీ టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు కుమార్ యాదవ్ డిమాండు చేశారు. సోమ వారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. పాఠశాలల మనుగడకు ముప్పు కలిగిస్తున్న ఈ జీవో కారణంగా 3, 4, 5 తరగతుల విలీ నం ప్రక్రియను కూడా వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. తరగతులను విలీనం చేయడం ద్వారా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి పాఠశాలలను మూసివేస్తున్న కారణంగా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు విద్య దూరమవేతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. ఉపాధ్యా యుల అభ్యంతరాలను పెడచెవిన పెట్టిన గత ప్రభుత్వం మొండిగా అమలు చేసి పాఠశాల విద్యను ప్రమాదకర స్థితిలో పడేసిందని కుమా ర్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా నాడు నేడు, పథకాల ఫొటోలు, ఆనలైన పనిభారం వంటి బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని ఆయన కోరారు. ప్రచార యావతో ఉపాధ్యాయులపై కక్ష పూరితంగా వ్యవహరించిన విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను వెంటనే తొలగించి ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిందిగా కుమార్ విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |