నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను లోకేశ్ సిద్ధం చేశారు. బాధ్యతల స్వీకరణకు ముందు నుంచే లోకేశ్ పని ప్రారంభించారు. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే యాక్షన్ ప్లాన్ రూపొందించారు. హెచ్ఆర్‌డీ మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంపై అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహించారు.