గిద్దలూరు నియోజకవర్గంలో దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని పింఛన్లు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఒక్కొక్కరు రూ.50వేలు ఖర్చుపెట్టి దివ్యాంగ ధ్రువీకరణపత్రం తెచ్చుకుంటున్నారని వివరించారు. అలా తన నియోజకవర్గంలో 3వేల సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిపారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేసి తొలగించాలని కోరారు. అనంతరం పలు అంశాలను ప్రస్తావించారు.దర్శి, వైపాలెం ఇన్‌చార్జిలు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబులు వారి నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో శ్రీలత తదితరులు పాల్గొన్నారు.