వెలిగొండ ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీలో భారీ అక్రమాలు జరిగాయని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ట్యాంకర్ల ద్వారా నీటి రవాణాలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. నీటిని తోలకుండానే బిల్లులు మంజూరు చేశారన్నారు. వీటన్నింటిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.