గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అన్నారు. బుధవారం గుంటూరు 57వ డివిజన మద్దిరాల కాలనీ, బసవతారకరామ నగర్‌లలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం సైడ్ డ్రెయిన్స నిర్మించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని, చిన్నపాటి వర్షానికే ఇళ్లల్లోకి మురుగు నీరు వస్తుందని, పాములు వస్తున్నాయని, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి కార ణంగా వ్యాధుల భారిన పడుతున్నామని మద్దిరాల కాలనీ, బసవతారక రామనగర్ వాసులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే అసమర్థత వల్ల నియోజకవర్గంలోని ప్రజలు అన్ని విధాల నష్టపోయి సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్నారన్నారు. రానున్న ఆరు నెలల్లో సమ స్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. మద్దిరాల కాలనీలో మురిగునీటి కాలువలు నిర్మాణం చేపడతామని తాత్కాలికంగా రైల్వే అధికారులతో మాట్లాడి ఖాళీ ప్రదేశం లోకి డ్రెయినను మళ్లించేలా చూస్తానని, మంచినీటి పైపులైన్లు, వీధి దీపాల సమస్య లని కమిషనర్, నగరపాలక సంస్థ అధికారులతో చెప్పి చేయిస్తానని అన్నారు. కార్యక్ర మంలో అధికారులు డీఈ శ్రీధర్, ఏఈ సునీల్, తెలుగుదేశం, జనసేన నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, కనకారావు, పల్లెపోగు రమేష్, సుజాత, నాగకిరణ్, కాసింబాబు ఇమ్రాన, శ్రీనివాసరావు నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.