బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా విషయంలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకూడదని బాపట్ల నియోజకవర్గ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల నియోజకవర్గ ఆర్డబ్ల్యూఎస్ శాఖాధికారులతో బుధవారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న మంచినీటి చెరువులు నిరంతరం తాగునీటితో నిండి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి చెరువుల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు.