పలాస పరిధిలోని పాత జాతీయ రహదారి కిడ్నీ ఆసుపత్రి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విష మంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం రంగోయి గ్రామం నుంచి పలా సలోని బ్యాంకు పనిపై వెలుగు గ్రామైక సంఘ అధ్యక్షురాలు బొంగు వనజాక్షి, గ్రామ సంఘ అధ్యక్షురాలు కుప్పిలి త్రివేణి, స్వయంశక్తి సం ఘ గ్రూపు సభ్యులు బొంగి రమణమ్మ, గేదెల విజయలక్ష్మి, తెప్పల మోహినమ్మ, మచ్చ వర లక్ష్మి, వనజాక్షి, దివ్య, ఓ చంటి పాపతో ఆటోలో వస్తుండగా కిడ్నీ ఆసుపత్రి జంక్షన్ వద్ద ఎదురు గా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బో ల్తా పడింది. ఈ ఘటనలో వీరంతా గాయప డ్డారు. వీరిలో వనజాక్షి, రమణమ్మకు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆటో డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.