ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోని కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లోని ఇసుక ర్యాంపుల వద్ద అక్రమ ఇసుక రవాణా జరగకుండా ఉండేందుకు బుధవారం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు పీవో ఎం.సూర్య తేజ తెలిపారు. గత నెలలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, మైనింగ్ అధి కారులు ఇసుక ర్యాంపుల వద్ద పర్యటించారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ క్రమంలోనే సోలర్ సిస్టమ్ ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కుక్కు నూరు మండలంలోని దాచారం, వింజరం, ఇబ్రహీం పేట ఇసుక రీచ్‌ల వద్ద, వేలేరుపాడు మండలం రుద్రమకోట రీచ్‌లో సోలార్ విధానంతో పని చేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బందిని నియమించి నిరంతర పర్యవేక్షణ చర్యలు తీసుకు న్నట్టు పీవో తెలిపారు. ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరిగితే బాధ్యు లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తా మన్నారు. కాగా కుక్కునూరు తహసీల్దార్ అచ్యుత కుమారి, ఆర్‌ఐ వెంకట్, వీఆర్వో ఇబ్రహీం, ఇసుక ర్యాంపుల వద్ద పర్యటించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు.