ఎచ్చెర్ల పరిధిలోని కుశాలపురం పరిధి నవభారత్ ఏరియాలో నివాసం ఉంటున్న దాసరి మంగమ్మ అనే మహిళపై జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎస్.చిరంజీవి బుధవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం నగరానికి చెందిన మంగమ్మ తన భర్త వర్థిరాజుతో ఉన్న విభేదాల కారణంగా కొద్ది నెలలుగా నవభారత్లో తన పిల్లలను పెట్టుకుని వే రేగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మంగళవారం వ్యక్తిగత కారణాలతో శ్రీకాకు ళం నగరం దమ్మలవీధికి చెందిన అల్లిబిల్లి రాధ, కోడ భవాని, లక్ష్మి, జయతో పాటు మరో ఇద్దరు వచ్చి మంగమ్మను ఈడ్చుకుంటూ ఆటోలోకి ఎక్కించి శ్రీకాకుళం నగరా నికి తీసుకెళ్లారు. తోటి మహిళ అని చూడకుండా విచక్షణారహితంగా వీరంతా ప్రవ ర్తించారు. దీంతో అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను స్థానికులు శ్రీకాకుళం సర్వ జన ఆసుపత్రికి తరలించారు. ఈమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులు వివరాలు నమోదు చేసి.. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్కు బదలాయించారు.