ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు అసెంబ్లీ వెళ్లడంపై భువనేశ్వరి ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 21, 2024, 04:05 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీకి వచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత సభకు విచ్చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను అవమానించడంతో శపథం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రోజు చంద్రబాబు నాయుడు సభకు రావడంతో ఆయన సతీమణీ భువనేశ్వరి సంతోషపడ్డారు. సోషల్ మీడియాలో ఎక్స్‌లో ట్వీట్ చేశారు. నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం అంటూ రాశారు. ఆ నాడు సభలో చంద్రబాబు శపథం చేశారని.. ఈ రోజు అదే సభలో ముఖ్యమంత్రిగా అడుగిడారని పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com