ప్రత్యేక విద్యుత అదాలతలో వినియోగదారుడి నుంచి వచ్చిన ఫిర్యాదులను 15రోజుల్లో గా పరి ష్కరించాలని ప్రత్యేక విద్యుత అదాలత చైర్మన, రిటైర్డ్ జడ్జి వి.శ్రీనివాస ఆంజనే యమూర్తి పేర్కొన్నారు. గురువారం మదనపల్లె స్థాని క ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ఈఈ యుగంధర్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల తో కూడిన బృందం ప్రత్యేక విద్యుత అదాలత నిర్వహించారు. ఈ సందర్భంగా అదాలత చైర్మన మాట్లాడుతూ విద్యుత సరఫరా, వినియోగం, వ్యవసాయ, పరిశ్రమల ట్రాన్సఫార్మర్ల ఏర్పాటు, విద్యుత లైన్లు షిఫ్టింగ్, వి ద్యుత బిల్లుల చెల్లింపు, ఇతర అంశాలపై వినియోగదారులు ఇచ్చే ఫిర్యాదుల ను ఆయా విభాగాలకు పంపుతామన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు పరిష్కారం చేయడంతో పాటు, ఒక వేళ పరిష్కరించే వీలులేకుంటే 15రోజుల్లో వినియోగదారుడికి సమాధానం రాయాలన్నారు. మొత్తం 16 మంది వివిధ అంశాలపై విద్యుత అదాలత చైర్మనకు ఫిర్యా దులు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక విద్యుత అదాలత ఆర్థిక సభ్యు డు కె.రామమో హనరావు, సాంకేతిక సభ్యుడు ఎస్.ఎల్.అంజనికుమార్, స్వతంత్య్ర సభ్యు రాలు జి.ఈశ్వ రమ్మతో పాటు ఎస్పీడీసీఎల్ ఏడీఈలు సురేంద్రనాయక్, జీవనకుమార్, రుక్మాంగదబాబు, కార్యాలయ ఏవో కిరణ్‌కుమార్, ఏఈలు రెడ్డికుమార్, నరసింహారెడ్డి, గోవిందరెడ్డి, రమేశ, ఎస్పీడీసీఎల్ సిబ్బంది పాల్గొన్నారు.