కాణిపాక ఆలయంలో 50 సంవత్సరాల ముందు చూపుతో ఏర్పాట్లు చేస్తామని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఆలయ సమావేశ మందిరంలో సోమవారం ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో ఆయన అధికారులు, ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయంలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది జూలై 15 నుంచి కచ్చితంగా యూనిఫాం ధరించాలన్నారు. తిలక ధారణ చేసుకోవాలని సూచించారు. ఆలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రతి ఒక్కరు ప్రవర్తించాలన్నారు. భక్తులకు ఏదైనా అవసరం వచ్చి వారు సిబ్బందితో మాట్లాడితే దేవుడి ప్రతినిధితో మాట్లాడినట్లు సిబ్బంది ప్రవర్తన ఉండాలన్నారు. వరసిద్ధుడి ఆలయానికి చెందిన 14 గ్రామాల ఉభయదారులు అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఆలయ ఉభయదారుల గౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా చూస్తానన్నారు. ఆలయ మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టాల్సిన కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ సమావేశంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈవోలు ఎస్వీకృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, మండల టీడీపీ అధ్యక్షుడు గిరిధర్‌బాబు, ఆలయ మాజీ చైర్మన్ మణినాయుడు, నాయకులు గంగారపుహరిబాబునాయుడు, ఎంఎన్ చౌదరి, మధుసూదన్‌రావు, హేమాద్రినాయుడు, నరసింహులునాయుడు, విక్రం తదితరులు పాల్గొన్నారు.