కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం బదిలీ చేసింది. గతవారం జరిగిన బదిలీల్లో.. కొంత మంది సీనియర్ ఐఏఎ్‌సలకు కీలక పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు పోస్టింగ్ పొందిన వారిలో ద్వివేది కూడా ఉన్నారు. జగన్ సర్కారుతో అత్యంత సన్నిహితంగా మెలగిన ఆయన్ను జీఏడీకి పంపిస్తారని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఆయన్ను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అనంతరం ప్రభు త్వం పునరాలోచనలో పడింది. సోమవారం రాత్రి ఆయన్ను కార్మిక శాఖనుంచి రిలీవ్ చేయడంతో పాటు జీఏడీకి అటాచ్ చేస్తూ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కార్మిక శాఖకు వెళ్లినా, ప్రభుత్వం అక్కడ నుంచి బదిలీ చేసింది. ఆయన స్థానంలో పశు సంవర్థక శాఖ సెక్రటరీగా ఉన్న ఎం.ఎం.నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.