గోపాలపురం నియోజకవర్గ ఫొటో, వీడియోగ్రాఫర్లకు సార్వత్రిక ఎన్నికల విధుల పారితోషికం చెల్లించాలని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. రోజుకు రూ.2250 చొప్పన చెల్లించే విధంగా 59రోజులు 30మంది పనిచేశామన్నారు.దానికి సంబంధించిన సొమ్మును తహశీల్దార్‌కు చెక్కును పంపించినట్టు కలెక్టర్ చెప్పారని, అయితే ఎటు వంటి సొమ్ము రాలేదని, కలెక్టర్‌ను అడగాలని తహశీల్దార్ చెబుతున్నార న్నారు. అన్ని నియోజకవర్గాల్లో 70శాతం సొమ్ము చెల్లిస్తే, గోపాలపురంలో 20శాతం మాత్రమే చెల్లించారని, మిగిలిన సొమ్ము చెల్లించాలని 45 రోజులుగా కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నామని ఫొటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గెల్లా రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు చిర్ర సూర్య, దేశాబత్తుల శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అలాగే ఎన్నికల విధులు నిర్వర్తించిన సచివాలయ కార్యదర్శులకు పారితోషకాలు ఇవ్వలేదని సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే దొమ్మేరు గ్రామానికి చెందిన కేవీకే రంగారావు వైసీపీ ప్రభుత్వంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలను చెల్లించాలని ఫిర్యాదు చేశారు. ధాన్యం విక్రయించి 60రోజులు దాటుతున్నా సొమ్ములు ఖా తాల్లో జమ చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారన్నార న్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ రావడంతో ధాన్యం బకాయిలు చెల్లించడానికి ఆలస్యమైందని, దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వ రగా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆరు ఫిర్యాదులు స్వీకరించినట్టు సబ్‌కలెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.