జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటింటి రేషన్ పంపిణీ కి నారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం మంగళం పాడేందుకు సిద్ధమైంది. గిరిజన ప్రాంత ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్లీ తిప్పలు తెస్తోంది. పెన్షన్ పంపిణీకి వాలంటీర్స్ ను దూరం చేస్తూ నిన్న కేబినెట్‌లో తీర్మానం చేశారు. నేడు ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు ఇక కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే.. రేషన్ షాప్స్ వద్ద మళ్లీ క్యూ లైన్లో తిప్పలు పడనున్న గిరిజనులు. గత ఐదేళ్లు గడప వద్దే జగన్ ప్రభుత్వం అందించిన సేవలకి వరుసగా మంగళం పాడుతున్నారు.