‘సాక్షి టీవీ’ సహా టీవీ9, NTV, 10TV ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో చట్టవిరుద్ధంగా నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ కక్షలకు వార్తా ఛానళ్లను బలి చేయొద్దని సూచించింది. ‘సాక్షి టీవీ’ సహా టీవీ9, NTV, 10TV ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో తక్షణం పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉండడం వల్ల ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్-NBF ఆశ్రయించగా.. న్యాయస్థానం ఈ ఉత్తర్వులిచ్చింది. TV9, సాక్షి, 10టీవీ, NTV న్యూస్ ఛానెల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ NBF హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా న్యూస్‌ఛానెల్స్‌ని బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టిందని తెలిపింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రాత్మకమైనవి NBF అభినందించింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పిందని NBF తెలిపింది.