ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ద్విచక్రవాహనం నడిపే వారందరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించని పక్షంలో పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో అనేక మంది ప్రమాదాల్లో మరణిస్తున్నారని.. హెల్మెట్ లేకపోవడం కూడా మరణాలకు కారణమంటూ హైకోర్టులో న్యాయవాది తాండవ యోగేశ్ పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.. బైక్ నడిపే వారికి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తనిఖీలు చేసే సమయంలో తప్పనిసరిగా బాడీ కెమెరా ధరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల్లో పేర్కొన్నారు.