మత్తు పదార్థాల వినియోగంకు యువత దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఎం. దీపిక గురువారం మాట్లాడుతూ, మత్తు పదార్థాల విక్రయం, రవాణ, వినియోగించే వారి సమాచారాన్ని డయల్ 100 లేదా టాస్క్ ఫోర్స్ సిఐ 9121109416 కు అందించాలని కోరారు. గంజాయి అక్రమ రవాణ కేసుల్లో ఎవరైనా యువత అరెస్టుఅయితే వారి భవిష్యత్తు నాశనమైనట్లే నన్నారు. 10సం. లకు పైబడి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు.