రాజమహేంద్రవరం పరిధిలోని నల్లజర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో అనంతపల్లిలో ఒక మహిళ చెదల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కేసులో అను మానాలు వ్యక్తపరుస్తూ వదంతులు వ్యాప్తిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుం టామని కొవ్వూరు డీఎస్పీ కె.శ్రీనివాసమూర్తి హెచ్చరించారు. ఈ నెల 23న ఉదయం 7.30గంటల సమయంలో గ్రామానికి చెందిన మండల రాము అనే వ్యక్తి తన భార్య మండల పెద్దింట్లు తనకున్న అనారోగ్య సమస్యలవల్ల 22న ఉదయం 5గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న చెదల మందు తాగి అపస్మారక స్థితిలో బాత్‌రూం వద్ద పడి ఉండగా బంధువులు, చుట్టుపక్కల వారు వైద్యం కోసం ఆమెను పుల్లలపాడు ఆస్పత్రికి తరలించారని చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. మెరుగైన చికిత్స కోసం ఏలూరు ఆంధ్రా హాస్పటల్‌కి తర్వాత గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించిందని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. తానే చెదలమందు తాగినట్లు పెద్దింట్లు తెలిపిం దన్నారు. ఆమె భర్తగానీ, డాక్టర్ ఇచ్చిన సమాచారంలోగానీ ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని డీఎస్పీ వివరించారు. బం ధువులు, సాక్షుల సమక్షంలో శవపంచనామా నిర్వహించిన సమయంలో కూడా ఎలాంటి అనుమానాలూ వ్యక్తం కాలేదన్నారు. కొన్ని దిన పత్రికల్లో ఆరోప ణలు వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించారన్నారు. అలాంటి అనుమానాలను రక్తసంబంధీకులు లేదా బంధువులు, సాక్షులు వెల్లడించలేదని చెప్పారు. అనంతపల్లికి చెందిన టీడీపీ వర్గీయులు, ఇతర వ్యక్తులు, రాముపై గానీ ఎవరూ ఫిర్యాదు చేయ లేదన్నారు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామన్నారు. పత్రికల్లో వచ్చిన అంశాలు అవాస్తవాలని డీఎస్పీ తెలిపారు. అలాంటి వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa