నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఆది నుంచి పాడికుండగా పేరు పడిన నూజివీడు ట్రిపుల్ ఐటీ అభివృద్ధి పనులను ఆసరాగా తిరిగి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు గతంలో ఇక్కడ పనిచేసిన వారు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఇక్కడ డైరెక్టర్‌గా దాదాపు ఖరారు అయ్యారని, ట్రిపుల్ ఐటీలో గతంలో డైరెక్టర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి పేరు ప్రచారం సాగింది. అయితే సదరు వ్యక్తికి ప్రొఫెసర్‌గా పదేళ్ల ఎక్స్‌ఫీరియన్స్ లేదని ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కె.సిరెడ్డి అభ్యంతరం చెప్పడంతో డైరెక్టర్‌గా తిరిగి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయ్యారు. అయితే తాజాగా ఆ వ్యక్తికి ఎక్స్‌ఫీరియన్స్ రావడంతో పాటు ఇటు ప్రభుత్వం మారడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కొందరు కాంట్రాక్టర్ల సహాయంతో డైరెక్టర్‌గా వచ్చేం దుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.