ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పూర్తిగా కంప్యూటరీకరించి బహుళ ప్రయోజన సహకార సంఘాలుగా మారుస్తున్నామని, అందులో భాగంగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, రాష్ట్ర శాఖ పర్యవేక్షణలో ఉమ్మడి 13 జిల్లాలోని 1858 సహకార సంఘాల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి డాక్టర్ ఎస్‌ఎల్‌ఎన్‌టీ శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ కేబీఎన్ కళాశాలలో శుక్రవారం ఈనెల 28, 29 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని సంఘాల సిబ్బందికి శిక్షణను ఆయన ప్రారం భించారు. జూలై 1, 4 తేదీల్లో కృష్ణా జిల్లాకు చెందిన పీఏసీఎస్‌ల సిబ్బం దికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కామన్ సర్వీస్ పోర్టల్ ద్వారా 300 రకాల సేవలను అందిస్తారని, దీంతో సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఆయన తెలి పారు. ఈ కార్యక్రమంలో 58 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యనిర్వహణాధికారులు, జిల్లా సహకార అధికారి డాక్టర్ డి.శ్రీని వాస రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రర్ రత్నగిరి, డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.