దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి ప్రతిరోజు ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య మహా నైవేద్య కార్యక్రమం జరుగుతున్నందున దర్శనాలు నిలిపివేస్తున్నామని ఈవో కేఎస్ రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటుగా దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని శుక్ర, శని, ఆదివారాలతో పాటు ఇతర రోజుల్లో కూడా భక్తుల రద్దీ పెరుగుతున్నందున భక్తులకు మెరుగైన సేవలందించేందుకు వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులు, అన్ని శాఖల అధికారులు ఉదయం 11.30 మధ్యాహ్నం 1.30 గంటల లోపు కాకుండా ఇతర సమయాలలో దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. శుక్ర, శని, ఆదివారాలలో ఇతర ప్రత్యేక రోజులలో రద్దీ వీపరితంగా ఉండటం వలన కొండపైకి వాహనాల రాకపోకలను రద్దు చేసామని పున్నమిఘాట్, సీతమ్మవారి పాదాల వద్ద పార్కింగ్‌లో వాహనాలను నిలుపుకుని దేవస్థానం బస్సులలో కొండపైకి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.