అరకు కాఫీ టేస్ట్ ఖండాతరాలు దాటింది. పారిస్‌లో అరకు కాఫీ రెండో కేఫ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా వెల్లడించారు.అరకులోయలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్న గిరిజనుల కృషికి మద్దతుగా నిలుస్తున్న ప్రధాని మోదీకి ఆనంద్ మహీంద్రా ధన్యవాదాలు తెలిపారు. అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచంలో ఫేమస్ బ్రాండ్‌గా మారిందన్న ఆనంద్ మహీంద్రా.. ప్రపంచంలోని అత్యుత్తమ కాఫీలలో ఒకటిగా అరకు కాఫీ నిలిచిందన్నారు. గిరిజన రైతులను అరకు కాఫీని పండించేలా ప్రోత్సహించాలంటూ చంద్రబాబు అప్పట్లో సూచించారన్న ఆనంద్ మహీంద్రా.. చంద్రబాబు సూచనలతో డాక్టర్ రెడ్డితో కలిసి నాంది ఇండియాను ప్రారంభించామని ట్వీట్లో రాసుకొచ్చారు.
అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేందుకు మనోజ్ నాంది టీమ్‌తో కలిసి అరకు కాఫీని మొదటి అవుట్‌లెట్‌ను పారిస్‌లోని మరైస్ రాష్ట్రంలో అప్పట్లో ఏర్పాటు చేశామని ఆనంద్ మహీంద్రా గుర్తు చేసుకున్నారు.మరోపైపు పారిస్ వాసులకు అరకు కాఫీ రుచులను పంచేలా పారిస్‌లో త్వరలోనే అరకు కాఫీ రెండవ కేఫ్‌ను ప్రారంభించనున్నట్లు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. అరకు కాఫీని పండించడం ద్వారా ఇప్పటి వరకూ 3 లక్షలమంది గిరిజనులు పేదరికం నుంచి బయటపడ్డారన్న ఆనంద్ మహీంద్రా.. 42 వేల రైతు కుటుంబాలు లక్షాధికారులుగా మారాయని అన్నారు. ఈ కుటుంబాలన్నీ ఒక్కో సీజన్‌కు లక్ష రూపాయల వరకూ లాభాన్ని గడిస్తున్నాయని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. అరకు కాఫీ రుచి అమోఘమన్న మోదీ.. ప్రపంచంలో ఉన్న కాఫీ ప్రేమికులు.. ఏపీలోని అరకుకు వచ్చి కాఫీ రుచి చూడాలని ఆహ్వానించారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చేశారు.ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ను రీట్వీట్ చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పారిస్‌లో అరకు కాఫీ రెండో కేఫ్ ప్రారంభించడం గొప్ప విషయమని ట్వీట్ చేశారు.
అరకు కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అరకునామిక్స్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్.. గిరిజన సోదరసోదరీమణుల జీవితాలను మార్చేశాయని.. ఒక కలను సాకారం చేశాయని ట్వీట్ చేశారు.భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని విజయగాథలు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలని ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.
![]() |
![]() |