రేపటి(బుధవారం) ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులు పయ్యావుల, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రుల ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కసరత్తు చేశారు. పోలవరం, రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏఏ ప్రాజెక్టులు, స్కీములు కేంద్రం నుంచి రాబట్టొచ్చో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రధానికి వివరించి.. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.