నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సం ఘం యువజనవిభాగం అధ్యక్షుడు రాజమహంతి భానుచందర్ కోరారు. మం గళవారం శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లీకేజీకి పాల్పడిన వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితా లకు సంబంధించిన పరీక్షకావడంతో ఎంతో జాగ్రత్తతో నిర్వహించాల్సిన పరీక్ష విషయంలో అశ్రద్ధ వహించడం దురదృష్టకరమని తెలిపారు. ఎన్‌టీఏ నిర్వాకం వల్ల విద్యార్థులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు.