అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ని విద్యార్థి జేఏసీ నాయకలు కలిసి విజ్ఞప్తి చేశారు. అమరావతిలోని సచివాలయంలో మంగళవారం విద్యార్థి జేఎసీ నాయకులు రాయపాటి జగదీష్, కరుణాకర్, కార్తీక్, కృష్ణ, సాయి, తేజ తదితరులు మంత్రి గొట్టిపాటిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో నడిచే విధంగా చేయాలని, పరిశ్రలను ఏర్పాటుకు కృషి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.