సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి సీఐ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక కనిగిరి పట్టణంలోని స్థానిక సిఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫొటోలు, వీడియోలు ఇతర అభ్యంతరకర సందేశాలను పంపి బెదిరింపులకు గురిచేస్తారన్నారు. ఆన్ లైన్ పరిచయమయ్యే స్నేహితులను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.