గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామంలో బుధవారం రైతులకు వరి విత్తనాలను గ్రామ సర్పంచ్ కొల్లి రాంబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రాయితీపై విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన రైతులకు సూచించారు.
![]() |
![]() |