మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు (గురువారం) నెల్లూరుకి రానున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ ములాఖత్ కానున్నారు. దాడులు, హత్యాయత్నం కేసుల్లో రిమాండ్‌లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారు. జైలులో పిన్బెల్లితో జగన్ ములాఖత్ కావడంపై విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు హెలికాఫ్టర్‌లో కనపర్తిపాడుకి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి హైలికాఫ్టర్‌లో బయలుదేరి తాడేపల్లికి వెళ్లనున్నారు.
![]() |
![]() |