వంగవీటి మోహనరంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని.. రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పని చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో చూశామన్నారు.
![]() |
![]() |