హనుమాన్‌జంక్షన్ పరిధిలోని వేలేరు గ్రామం మధ్యలో ఉన్న ఊర చెరువులో చేపలు బుధవారం నుంచి చనిపోయి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయని దీంతో దుర్గంధం వెదజల్లుతోందని, ఫిర్యాదు చేసినా అధికా రులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరచెరువు గట్టు పైనే ప్రజలందరూ వినియోగించే వాటర్ ప్లాంటు ఉందని కలుషిత నీటి వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరు తున్నారు. కాగా, నెలక్రితం ఇదే చెరువులో చేపలు సాగుచేస్తున్న గుత్తేదారు మాంసం వ్యర్థాలను చేపలమేతగా వినియోగిస్తుండటం తో స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై కేసు పెట్టినా అధికారుల్లో చలనం లేదని, జిల్లా పంచాయతీ అధికారులు చెరువును తనిఖీ చేశారని ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు కార్తీక్, వీర్ల బ్రహ్మం తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.