నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛం దంగా మూసివేశారు. పలు పాఠశాలలు పనిచేస్తుండడంతో విద్యార్థి సంఘ నాయకులు వెళ్లి హెచ్ఎంలతో మాట్లాడి బంద్కు సహకరించాలని కోరారు. నీట్ పరీక్షలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో బి.జగన్, బి.వినోద్, ప్రణీత్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.