బి.కొత్తకోట పట్టణంలోని ఎరువుల దుకా ణాలపై విజిలెన్స అండ్ ఎనఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించి రూ.4.28 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేశారు. అగ్రికల్చర్ కమిషనరేట్ గుంటూరు వారి ఆదేశాల మేరకు సాల్‌రెడ్డి ఏడీఏ కర్నూల్, విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ రామక్రిష్ణలతో కూడిన అధికారుల బృంధం పట్టణంలోని పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఆకస్మిక తని ఖీలు చేశారు. ఇందులో ఎరువులు, పురుగుమందుల విక్రయా లు, నిల్వలకు సంబంధించిన రికార్డులు, బిల్లులను పరిశీలించగా యంవీఆర్ సీడ్స్ దుకాణంలో అమ్మకాలు, బిల్లులు సరిగా లేని కారణంగా రూ.4.28 లక్షల విలువైన ఎరువులను సీజ్ చేసి దుకా ణ లైసెన్సను 15 రోజులపాటు సస్పెండ్‌లో ఉంచారు. అదే విధంగా బాలాజి ఫర్టిలైజర్స్ దుకాణంలో తనిఖీలు చేయగా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఒకే దుకాణంలో విక్ర యించడం నిబంధనలకు విరుధ్ధమని గుర్తించి 16.9 టన్నుల ఎరువుల నిల్వలకు సంబంధించి తేడాలు ఉండటంతో ఈ షాపు లైసెన్స రద్దుకు జిల్లా వ్యవసాయ అధికారులకు సిఫారసు చేస్తున్నట్టు సాల్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏవో ఆపీస్ ఏవో వెంటమోహన, బి.కొత్తకోట ఏవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.