రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ సి.ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఆసుపత్రిలో రౌండ్స్ నిర్వహించారు. డైట్ విభాగాన్ని తనిఖీ చేశారు. రోగులకు అందించే సాంబరును పరిశీలించి ఇది రసామా లేదా సాంబారా అని సిబ్బందిని పరిశీలించారు. సాంబారులో పప్పు లేదని పలుచగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. రోగులకు, డాక్టర్లకు ఎంత మందికి భోజనం ఇస్తున్నారని ఆరా తీశారు. ఆసుపత్రిలో పలు విభాగాల్లో ఎలక్ర్టికల్ లైట్లు, ఫ్యాన్ల మరమ్మతులు ఏమైనా ఉంటే తన దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదని నర్సింగ్ సూపరింటెండెంట్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జీవనాధార మెడికల్ షాపులను తనిఖీ చేశారు. ఏయే రకాలైనా మందులు అమ్ముతున్నారో ఆరా తీశారు. కార్యక్రమంలో సీఎస్ ఆర్‌ఎంవో వెంకటే శ్వరరావు, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో హేమనళిని, ఏఆర్‌ఎంవో వెంకట రమణ, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్లు శివబాల, కిరణ్ కుమార్, ఏపీఎం ఎస్‌ఐ డీసీ ఈఈ శివకుమార్ పాల్గొన్నారు.