శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం శాసనసభ్యులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం చిలమత్తూరు మండలంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం హిందూపురం పట్టణ సమీపంలోని కోటిపి రోడ్డులో రూ. 3. 50 కోట్లతో నిర్మాణం చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. పరిగి బస్టాండ్ సమీపంలో రూ. 44. 60 లక్షలతో సిసి రోడ్డు పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.