రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. తిరుపతి జిల్లా నాయుడపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న(ఆదివారం) కలుషిత ఆహారం వల్ల పాఠశాలలోని దాదాపు 150 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది.. విద్యార్థులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన మంత్రి వీరాంజనేయస్వామి విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా నియోజకవర్గంలో నేటి పర్యటనలు వాయిదా వేసుకుని మంత్రి హుటాహుటిన నాయుడుపేటకు బయలుదేరారు. మరోవైపు గత అర్ధరాత్రి అధికారులు కూడా గురుకులానికి చేరుకున్నారు. గురకులాన్ని పరిశీలించిన కలెక్టర్... అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు.