మహానందీశ్వరుని దర్శనం కోసం వేలాదిమంది భక్తులు ఆదివారం తరలిరావడంతో ఆలయం పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. శని, ఆదివారాలు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి వివిధ వాహానాల ద్వారా భక్తులు శనివారం రాత్రే మహానందికి తరలివచ్చారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే పరమశివుని దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు. కుటుంబ సమేతంగా ఆలయం ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతో పాటు పూల కోనేర్లల్లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. ఓం నమఃశివాయ అనే శివనామ స్మరణతో మహానంది ఆలయం పరిసరాలు మార్మోగాయి.