ఒంగోలు నగరానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బాబురావు అన్నా క్యాంటీన్ నిర్వహణకు రూ. 50 వేల విరాళాన్ని అందజేశారు. ఆదివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ను ఒంగోలులోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో కలిసి నగదు రూపంలో అందజేశారు. పేదల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నిర్వహణకు సాయం అందిస్తున్న దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.