తన పేరు ప్రతిష్టలు దెబ్బ తీసిన వారైనా.. ఆఖరికి తమ పార్టీలో ఉన్న వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బైక్‌పై ఇద్దరు తమ ఇంటికి.. వచ్చి తాను ఎక్కడ ఉన్నానో విచారణ చేశారని తనకు తెలిసిందన్నారు. ఆ ఇద్దరు వచ్చిన ఫోటోను మీడియాకు విడుదల చేశారు.. ఆ వ్యక్తి ఎక్కడకు రమ్మంటే అక్కడికి వస్తాను.. తనకేం భయం లేదన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. మధ్యంతర ఎన్నికలు వచ్చినా తమదే గెలుపన్నారు. అప్పుడు అందరి తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు.
ఆధారాలు లేని ఆదివాసీ మహిళలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ. అవాస్తవాలు ప్రసారం చేసిన మీడియాతో ఎలా క్షమాణాలు చెప్పించాలో తనకు తెలుసని.. తాను ఎవర్నీ బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి కాదన్నారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే దేవుడే శిక్షిస్తారని.. ఈ కుట్ర, కుతంత్రాలు వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తానన్నారు. ప్రతి పక్షంలో ఉన్నా ఎవరిని వదలను.. అందరికీ బుద్ధి చెప్తానని.. యూట్యూబ్ ఛానల్స్‌పై చర్యలు కూడా ఉంటాయన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తేలేదు అన్నారు.
తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలేది లేదన్నారు ఎంపీ. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆమెతో తనకు సంబంధం అంటగట్టడం దారుణమన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారని.. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తానన్నారు.. వారితో క్షమాపణలు ఎలా చెప్పాలో తనకు బాగా తెలుసన్నారు. తాను చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి జీవితంలో ఎదిగానని.. తను ఎవర్నీ బ్లాక్‌మెయిల్ చేసి వసూళ్ల చేసే వ్యక్తిని కాదన్నారు.
ఈ విషయాన్ని మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్టీ కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ. పార్లమెంట్‌లోప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానన్నారు. కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. తాటాకు చప్పుళ్లకు తాను భయపడే వాడిని కాదన్నారు. తమ పార్టీ ఓటమిపై తాము సమీక్షించుకుంటున్నామని.. 175 స్థానాలకు.. వైఎస్సార్‌సీపీకి 11 స్థానాలు ఎలా వచ్చాయో తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని.. అలాగే కూటమి సూపర్ సిక్స్ హామీలను ఇచ్చిందని గుర్తు చేశారు.. ఇప్పటికీ హామీలు అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. క్రమపద్ధతిలో వైఎస్సార్‌సీపీనేతలపై కుట్రలు జరుగుతున్నాయని.. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. తనపై బురదచల్లే ఎవరినీ వదలబోనని వ్యాఖ్యానించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ.
తప్పుడు ప్రచారం చేసే కొందరు జర్నలిస్టులను శిక్షించేలా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడతానన్నారు ఎంపీ.
సహాయం కోసం వస్తే సంబంధం కట్టేస్తారా.. వయసుతో సంబంధం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. సాయిరెడ్డి తండ్రి లాంటి వారని ఆదివాసీ మహిళ చెప్పిందని.. కుట్రలో భాగంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తప్పుడు ప్రచారం చేశారన్నారు.. కొందరు పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. నిజనిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు తనపై వార్తలు రాస్తున్నారని.. తమ పార్టీకి చెందిన కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. త్వరలోనే తాను ఓ న్యూస్ ఛానల్ పెడతానని.. కుల ఛానల్ మొత్తం వ్యవహారాన్ని బయటపెడతానన్నారు. తాను పెట్టే ఛానల్ న్యూట్రల్ గా ఉంటుందన్నారు.
గతంలో తాను సొంతంగా ఛానల్ పెట్టి తీరతానని.. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదంటున్నారు. అప్పుడు మనకొక ఛానల్ ఉంది కదా వద్దని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారించారన్నారు. దీంతో తాను విరమించుకోవాల్సి వచ్చిందని.. ఈ సారి మాత్రం తగ్గేదే లేదని.. ఛానల్ తప్పకుండా ప్రారంభిస్తానని చెప్పారు. ఎవరి వద్దని వారించినా స్టార్ట్ చేస్తానని.. తను పెట్టే ఛానల్ న్యూట్రల్‌గా ఉంటుందని.. నిజాలు మాత్రమే చెబుతానన్నారు. విశాఖపట్నంలో తాను భూములు అక్రమిస్తే.. వాటిని తిరిగి తీసుకోవాలని.. తనకేమీ అభ్యంతరం లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ. స్కాలర్షిప్ విషయంలో శాంతి మాజీ భర్త మదన్ మోహన్ తనను రెండు సార్లు కలిశారని.. వాడికి.. తనకూ ఏ మాత్రం సంబంధం లేదన్నారు.