అనకాపల్లి నుంచి గూడూరు మీదుగా చెన్నైకి తరలిస్తున్న 23.5 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. చెన్నైకి చెందిన సెల్వం గోకుల్, శరవణన్ అభిషేక్, రాజ్ తమిళసెల్వం, శివ కొంతకాలంగా అనకాపల్లి నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్నారు.గూడూరులోని రైల్వే పార్శిల్ కార్యాలయం వద్ద మంగళవారం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, వన్‌టౌన్ సీఐ పాపారావు, ఎస్‌ఐ శ్రీహరి తదితరులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి వద్ద దాదాపు రూ 1.70 లక్షల విలువ చేసే 23.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గంజాయి విక్రయించినా, తరలించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు కూడా గంజాయి నివారణకు సహకరించాలని ఎవరైనా విక్రయిస్తుంటే వెంటనే పోలీసు వాట్సాప్ నెంబరు 8099999977కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa