గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధుల నియంత్రణపై పంచాయతీ, సచివాలయ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.కొవ్వూరు మండలం చిడిపి పంచాయతీలో అపారిశుధ్య సమస్య ఉందని తెలియడంతో రాజమండ్రి కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కొవ్వూరు గ్రామంలో కాలినడకన తిరిగి పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. సర్పంచ్ పాలడుగుల లక్ష్మణరావు గ్రామంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ...... ఓహెచ్‌ఆర్ ట్యాంకుల నిర్వహణలో భాగంగా గత శనివారం ఎన్ని ట్యాంకులు శుభ్రం చేయించారని అధికారులను ప్రశ్నించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సిల్టు తొలగించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో కె.సుశీల,ఈవోపీఆర్‌డీ శర్మ,సెక్రటరి నరేంద్ర ఉన్నారు.