పాడిపశువుల అభివృద్ధికి కృషి చేయాలని రైతులకు పశుగణాభివృద్ది డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ పిలుపునిచ్చారు. పెద్దవడుగూరు మండలం కాశేపల్లిలో శుక్రవారం లింగ నిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భాదారణ పథ కంపై పాడి రైతులకు ఆయన అవగాహన కల్పించారు. పాడి పశువులు అభివృద్ధి జరగాలంటే పెయ్య దూడలు జన్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశువులను పరీక్షించి రూ. 1, 350 విలువ చేసే సూదులను సబ్సిడీతో రూ. 500కే అందిస్తున్నామన్నారు.