గుంటూరు జిల్లా కేంద్రంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం మోహనరంగా నాయక దేవస్థానంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆది గురువు జాంబవ పేరున గురుపూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు హోమాలలో పెనుకొండ కు చెందిన బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ, సభ్యులు రాజశేఖర్ పాల్గొన్నారు.