ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. రానున్న రోజుల్లో ఏపీకి పెద్దఎత్తున్న నిధులు కేటాయిస్తామని కేంద్రం చెప్పింది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. నేడు అయన మాట్లాడుతూ.... ఎన్నికల్లో కూటమిగా టీడీపీ, బీజేపీ, జనసేనా పోటీ చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ ఉంది. కేంద్ర మంత్రి సీతారామన్ జనరంజక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన, గృహ నిర్మాణం, మహిళా సంరక్షణ కోసం నిధులు కేటాయించారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా బడ్జెట్ ప్రకటించారు. భవిష్యత్తులో ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధుల కేటాయింపు కొనసాగుతుంది అని చెప్పారు.