ఎన్డీఏ విధానాలు దేశ ప్రజలు మెచ్చి మూడోసారి ప్రధాని మోడీకి అధికారం ఇచ్చారు. ఈసారి బడ్జెట్‌లో నాలుగు ప్రధాన రంగాలపై దృష్టి కేంద్రీకరించారు. పేదలు, యువత, మహిళలు, రైతులకు పెద్దపీట వేశారు అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ.... వైసీపీ నేతలు మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని నిర్వీర్యం చేశారు. కానీ కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేటాయించారు. ఇతర సంస్థల నుంచి వనరులను తీసుకొచ్చేలా కేంద్రం గ్యారంటీ ఇస్తామని చెప్పింది. ఏపీ రాజధాని బాధ్యతను మోడీ ప్రభుత్వం తీసుకుందని స్పష్టంగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఏ రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్లాలన్నా మౌలిక వసతులు కీలకం. గడచిన ఐదేళ్లుగా రోడ్లను ఎలా విస్మరించారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మౌలిక వసతుల కల్పన, పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టాం. కొప్పర్తి ఇండస్ట్రీయల్ నోడ్‌కు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని బడ్జెట్‌లో చెప్పాం. ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ నోడ్‌కు కూడా కేంద్రం పూర్తి సహాయం అందిస్తామని చెప్పింది. దీని ద్వారా రాయలసీమ అభివృద్ధి వేగవంతం కానుంది. పూర్వోదయ పేరుతో తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టామని" చెప్పుకొచ్చారు.