ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీకార రాజకీయాలు తారాస్థాయికి చేరాయని, వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఇటీవల వినుకొండలో జరిగిన దారుణ హత్య దేశమంతా చూసిందని గుర్తు చేశారు. గతంలో.. ఎన్నడూ ఇలాంటివి జరగలేదు. గత ఐదేళ్లు శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది అవి క్షీణిస్తూ వచ్చాయి. చంద్రబాబు రాష్ట్రంలో చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ కేడర్‌ను ఉసిగొల్పి రాష్ట్రంలో నరమేధాన్ని సృష్టిస్తున్నారు. దీంతో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు.. ఆఖరికి ఓట్లు వేశారన్న కారణంగా కూడా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా నిరసన గళం విప్పి ఏపీ పరిస్థితులను వివరించాలని ఇవాళ ధర్నా చేస్తున్నాం. రాష్ట్రపతి పాలన విధిస్తేనే ప్రజలు నెమ్మదిగా జీవిస్తారని మాజీ మంత్రి అంబటి పేర్కొన్నారు.