ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలలో పోషక ఆహార గార్డెన్ ను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీ ఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లాలో మొదటి విడతలో 121 ప్రభుత్వ పాఠశాలలో పోషకాహార గార్డెన్స్ కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.