ఏపీలో శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగిస్తున్నారంటూ ఢిల్లీలో జగన్ ఓ పక్క ధర్నా చేస్తుంటే.. మరో పక్క పార్టీలో పెద్దలు తనను మానసికంగా ఇబ్బడులకు గురిచేస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు తాజాగా రాజీనామా చేశారు. తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. అయితే రాజీనామా అనంతరం ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందనే వార్తలు తెరపైకి వస్తున్నాయి.